Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కార్తి జోడీగా కనిపించనున్న పూజ హెగ్డే!

Awara Sequel
Advertisement
  • వరుస ఫ్లాపులతో ఉన్న పూజ హెగ్డే
  • ప్రస్తుతం మహేశ్ మూవీతో బిజీ
  • 'ఆవారా' సీక్వెల్ లో చేసే ఛాన్స్ 
  • 'బీస్ట్' తరువాత పూజ చేయనున్న సినిమా  
Advertisement
పూజ హెగ్డేకి వరుస ఫ్లాపులు పడినప్పటికీ, ఆమెకి ఉన్న క్రేజ్ గానీ .. మార్కెట్ గాని తగ్గలేదు. ఆమెను వెతుక్కుంటూ అవకాశాలైతే వస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయి ఫ్లాపులు పడినప్పటికీ, ఆమె కూడా ఏమీ కుంగిపోవడం లేదు. వచ్చిన అవకాశాల్లో తనకి నచ్చినవాటికి సైన్ చేస్తూ ముందుకు వెళుతోంది.

ప్రస్తుతం తెలుగులో మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ రూపొందిస్తున్న సినిమాలో కథానాయికగా ఆమె నటిస్తోంది. ఇక మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళంలో కూడా ఆమె ఒక భారీ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు .. ఆ సినిమాలో హీరో కార్తి.

గతంలో కార్తి హీరోగా వచ్చిన 'ఆవారా' తమిళంతో పాటు తెలుగులోను హిట్ టాక్ తెచ్చుకుంది. 2010లో వచ్చిన ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి లింగుస్వామి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం ఆయన పూజ హెగ్డేను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. కార్తి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం పక్కానే. అంతా అనుకున్నట్టుగా జరిగితే 'బీస్ట్' తరువాత పూజ హెగ్డే చేసే సినిమా ఇదే అవుతుందని చెప్పచ్చు. 
Advertisement
Advertisement
Pooja Hegde
Karthi
Awara 2 Movie

More Telugu News